త్యాగరాజ కృతి

1.
ఎందరో మహానుభావులు
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: శ్రీ
తాళం: ఆది

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు

చందురూ వర్ణుని అంద చందమును హృదయారవుందమున
జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులు

సామగాన లోల మనసిజ లావణ్య
ధన్య ముర్ధన్యులెందరో మహానుభావులు

మానసవన చర వర సంచారము నెరిపి మూర్తి బాగుగ పొగడనే
వారెందరో మహానుభావులు

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము
సేయువారెందరో మహానుభావులు

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్ధమగు నిజ మార్గముతోను బాడుచును
సల్లాపముతో స్వర లయాది రాగముల దెలియు
వారెందరో మహానుభావులు

హరిగుణ మణిమయ సరములు గళమున
షోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే
బ్రోచువారెందరో మహానుభావులు

హొయలు మీర నడలు గల్గ్గు సరసుని
సదా కనుల జూచుచును పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము
గలవారెందరో మహానుభావులు

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశిపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు

నీ మేను నామ వైభవంబులను
నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను
వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను
దుర్మతములను కల్గ జేసినట్టి నీమది నెరింగి
సంతసంబునను గుణ భజనానంద కీర్తనము జేయు
వారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములను
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాప్తులైన
వారెందరో మహానుభావులు

ప్రేమ ముప్పిరి గొను వేళ నామమును దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని
నిజ దాసులైనన వారెందరో మహానుభావులు
అందరికీ వందనము-లెందరో మహానుభావులు

2.

జగదానంద కారకా
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: నాట్టై
తాళం: ఆది

జగదానంద కారకా

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

గగనాధిప సత్కులజ రాజ రాజేశ్వర
సుగుణాకర సురసేవ్య భవ్య దాయక
సదా సకల జగదానంద కారకా

అమర తారక నిచయ కుముద హిత పరిపూర్ణ నగ సుర సురభూజ
దధి పయోధి వాస హరణ సుందరతర వదన సుధామయ వచో
బృంద గోవింద సానంద మా వరాజరాప్త శుభకరానేక
జగదానంద కారకా

నిగమ నీరజామృతజ పోషకా నిమిశవైరి వారిద సమీరణ
ఖగ తురంగ సత్కవి హృదాలయా గణిత వానరాధిప నతాంఘ్రియుగ
జగదానంద కారకా

ఇంద్ర నీలమణి సన్నిభాప ఘన చంద్ర సూర్య నయనాప్రమేయ
వాగీంద్ర జనక సకలేశ శుభ్ర నాగేంద్ర శయన శమన వైరి సన్నుత
జగదానంద కారకా

పాద విజిత మౌని శాప సవ పరిపాల వర మంత్ర గ్రహణ లోల
పరమ శాంత చిత్త జనకజాధిప సరోజభవ వరదాఖిల
జగదానంద కారకా

సృష్టి స్థిత్యంతకార కామిత కామిత ఫలదా సమాన గాత్ర
శచీపతి నుతాబ్ధి మద హరా నురాగరాగ రాజితకధా సారహిత
జగదానంద కారకా

సజ్జన మానసాబ్ధి సుధాకర కుసుమ విమాన సురసారిపు కరాబ్జ
లాలిత చరణావ గుణ సురగణ మద హరణ సనాతనా జనుత
జగదానంద కారకా

ఓంకార పంజర కీర పుర హర సరోజ భవ కేశవాది రూప
వాసవరిపు జనకాంతక కలాధరాప్త కరుణాకర శరణాగత
జనపాలన సుమనో రమణ నిర్వికార నిగమ సారతర
జగదానంద కారకా

కరధృత శరజాలా సుర మదాప హరణ వనీసుర సురావన
కవీన బిలజ మౌని కృత చరిత్ర సన్నుత శ్రీ త్యాగరాజనుత
జగదానంద కారకా

పురాణ పురుష నృవరాత్మజ శ్రిత పరాధీన కర విరాధ రావణ
విరావణ నఘ పరాశర మనోహర వికృత త్యాగరాజ సన్నుత
జగదానంద కారకా

అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార
మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ
నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత
జగదానంద కారకా

జయ జానకీ ప్రాణ నాయకా
జగదానంద కారకా

3.
సాధించెనే ఓ మనసా
కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: ఆరభి
తాళం: ఆది

సాధించెనే ఓ మనసా

బోధించిన సన్మార్గవసనముల బొంకు జేసి తా బట్టినపట్టు
సాధించెనే ఓ మనసా

సమయానికి తగు మాటలాడెనే

దేవకీ వసుదేవుల నేగించినటు
సమయానికి తగు మాటలాడెనే

రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సాంప్రదాయకుడు
సమయానికి తగు మాటలాడెనే

గోపీ జన మనోరధ మొసంగ లేకనే గేలియు జేసే వాడు
సమయానికి తగు మాటలాడెనే

సారాసారుడు సనక సనందన సన్ముని సేవ్యుడు సకలాధారుడు
సమయానికి తగు మాటలాడెనే

వనితల సదా సొక్క జేయుచును మ్రొక్క జేసే
పరమాత్ముడనియు గాక యశోద తనయుడంచు
ముదంబునను ముద్దు బెట్ట నవ్వుచుండు హరి
సమయానికి తగు మాటలాడెనే

పరమ భక్త వత్సలుడు సుగుణ పారావారుండాజన్మ మన ఘూడి
కలి బాధలు దీర్చు వాడనుచునే హృదంబుజమున జూచు చుండగ
సమయానికి తగు మాటలాడెనే

హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాశ శేష శయన
పర నారి సోదరాజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పాఘన
సరసీరుహ దళాక్ష యనుచు వేడుకొన్న నన్ను తా బ్రోవకను
సమయానికి తగు మాటలాడెనే

శ్రీ వేంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస నికేతన
కనకాంబర ధర లసన్ మకుట కుండల విరాజిత హరే యనుచు నే
పొగడగా త్యాగరాజ గేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు
సమయానికి తగు మాటలాడెనే

సద్భక్తుల నడత లిట్లనెనే అమరికగా నా పూజ కొనెనే
అలుగ వద్దననే విముఖులతో జేర బోకుమనెనే
వెత గలిగిన తాళుకొమ్మననే దమశమాది సుఖ దాయకుడగు
శ్రీ త్యాగరాజ నుతుడు చెంత రాకనే
సాధించెనే ఓ మనసా.. సాధించెనే


ref:
Srinivas Vadrevu Blog - http://bhavayami.blogspot.com/

My Favourite Devotional Songs

My favourite International RSS Feeds ...

WSJ.com: US Business

WSJ.com: Money

WSJ.com: Most Viewed Week

WSJ.com Video - Economy

The Bankwatch

The Stalwart

Paul Krugman of NYTimes

Floyd Norris of NYTimes

The Better Banking Blog - Charis Palmer

Glenbrook Partners

Prem Panicker's Smoke Signals

Chandrahas Choudhury's The Middle Stage

Nitin Pai's on India

Kamat's Potpourri

Virsanghvi RSS